Hderabad: డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఆర్మీ

Army Officials Focused On Data Theft Case
x

దేశవ్యాప్తంగా 2.55 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఆర్మీ

Highlights

* జాతీయ భద్రతకు ముప్పు కావడంతో సీరియస్‌గా దృష్టి సారించిన ఆర్మీ

Data Theft Case: డేటా చోరీ కేసులో ఆర్మీ రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులతో రక్షణ రంగ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. నిందితుల వద్ద 2 లక్షల 55వేల ఆర్మీ ఉద్యోగుల వివరాలు ఉండటంపై ఆరా తీశారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే విషయం కావడంతో విషయంపై ఆర్మీ సీరియస్‌గా దృష్టి సారించింది. తమ ఉద్యోగుల డేటా నకలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేటా లీకేజీ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సైబరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.

కేసులో భాగంగా డేటా ప్రొవైడర్ జస్ట్ డయల్‌ను కూడా సైబరాబాద్ పోలీసులు విచారించనున్నారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌తో కేసు విచారణ కొనసాగుతోంది. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డేటాను తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ సైబర్ సేఫ్టీతో పోలీసులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాదులో డేటాకు సంబంధించి నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories