Rakesh Reddy: కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తుంది

Armoor MLA Rakesh Reddy made key comments on the budget
x

Rakesh Reddy: కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తుంది

Highlights

Rakesh Reddy: ఉత్తర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీసుకొస్తాం

Rakesh Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. బడ్జెట్‌లో నిధులను దక్షిణ తెలంగాణకే కేటాయించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర తెలంగాణ ప్రాజెక్టుల మరమ్మత్తులకు పదికోట్ల రూపాయలు ఇవ్వలేదని మండిపడ్డారు.

మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావులు తమ జిల్లాలకు మాత్రం నిధులు తీసుకునిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు మారకపోతే ఉత్తర తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కొడంగల్, నారాయణ పేట్ ప్రాజెక్టుకు 3వేల కోట్లు ఎలా కేటాయిస్తారన్న రాకేష్ రెడ్డి.. ఉత్తర తెలంగాణను నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా మారుస్తారా అని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories