ఫైర్‌బ్రాండ్‌ కపుల్‌ కొత్త దారి అన్వేషిస్తున్నారా?

ఫైర్‌బ్రాండ్‌ కపుల్‌ కొత్త దారి అన్వేషిస్తున్నారా?
x
Highlights

ఒక్కప్పుడు ఉమ్మడి స్టేట్‌లో ఒక వెలుగు వెలిగిన పొలిటికల్‌ కపుల్. ఓరుగల్లు కోట సాక్షిగా ఎదురేలేని రాజకీయ జంట. కానీ టైం బ్యాడ్‌తో, వారి పొలిటికల్ ఫేస్...

ఒక్కప్పుడు ఉమ్మడి స్టేట్‌లో ఒక వెలుగు వెలిగిన పొలిటికల్‌ కపుల్. ఓరుగల్లు కోట సాక్షిగా ఎదురేలేని రాజకీయ జంట. కానీ టైం బ్యాడ్‌తో, వారి పొలిటికల్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ మరో టర్న్‌ తీసుకునేందుకు సై అంటున్నారట. ఇంతకీ ఎవరా పొలిటికల్ కపుల్?

కొండా కపుల్. ఫైర్‌బ్రాండ్‌ కపుల్. కొండా సురేఖ దంపతులంటే, తెలియనివారుండరు తూటాల్లాంటి వారి మాట, మంటల దారిని తలపించే వారి బాట ఓరుగల్లు కోటలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ యమ ఫేమస్ కపుల్. అదంతా నాడు, మరి నేడేంటి? ఆ ప్రశ్నకు బదులిచ్చేపనిలోనే యాక్టివ్‌ అవుతున్నారట కొండా కపుల్.

తెలంగాణ రాజకీయాల్లో ఓరుగల్లు జిల్లాది ఓ ప్రత్యేక స్థానం. అందులో కొండా సురేఖ దంపతుల ప్రస్థానం మరింత ప్రత్యేకం. కాంగ్రెస్ పార్టీ, అందునా వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వారిది స్వర్ణ యుగం. జిల్లాలో వీరు చెప్పిందే వేదం. వీరు చేసింది శాసనం. వైఎస్సార్ మీద అభిమానాన్ని చాటుకుని ముందుగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత మారిన రాజకీయాలకనుగుణంగా గులాబీ తీర్థం పుచ్చుకుని నియోజకవర్గం మారి మరీ, సత్తా నిరూపించుకున్నారు. అది గత చరిత్ర వీరీ మోనోపలిజానికి గులాబీ పార్టీలో అధినేతకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2018 ఎన్నికల్లో, ఫస్ట్ ఫేజ్‌లో టికెట్ ఆపారు. నేరుగా సిఎం వీరితో చర్చించి బీఫాం ఇద్దామని భావిస్తున్న తరుణంలోనే, ఘర్‌ వాపసీ అంటూ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకుని, గులాబీ దండుపై విమర్శల జడివాన కురిపించారు. కాంగ్రెస్‌ తరపున పరకాలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి, బలవంతపు నిశ్శబ్దంలో వున్నారు. ఇప్పుడు ఈ నిశ్శబ్దాన్ని చేధించి, రీయాక్టివ్‌ అయ్యారు కొండా కపుల్స్.

కొండా సురేఖ సైలెన్స్ అయ్యి , మళ్ళీ గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చారు. అధికార టీఆర్ఎస్‌ నుంచి మాజీ కార్పొరేటర్‌ను కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకుని, గులాబీ దళానికిసవాల్ విసిరారు. అంతేకాదు వరంగల్ తూర్పు స్థానం నుంచి, బరిలోకి దిగేది తానేనని తేల్చిచెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, బీసీ లీడర్‌ను మేయర్ చేస్తామని శపథం చెయ్యడంతో, వరంగల్ లో రాజకీయ వేడి రగులుకుంది. కార్పొరేషన్ ఎన్నికలను కొండా దంపతులు ఎందుకింతగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నదానిపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందుచూపే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది.

గతంలో కొండా కపుల్స్‌కు అడ్డాగా ఉన్న పరకాల నియోజకవర్గాన్ని వీడి, వరంగల్ తూర్పు వైపు వారి మనసు మళ్లుతోందట. అందుకే తూర్పు నియోజకవర్గంలో సెల్ఫీలతో సందడిచేస్తున్నారట. 24 గంటలు తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారట. త్వరలో రాబోతున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ దమ్ము చూపిస్తామంటున్నారట. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, 23 డివిజన్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట కొండా కపుల్. ఇలా కార్పొరేషన్‌లో పాగా వేసి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆలోచిస్తున్నారట కొండా దంపతులు. చూడాలి, చివరికి ఏమవుతుందో.


Show Full Article
Print Article
Next Story
More Stories