సీనియర్లంతా కలిసి వీహెచ్‌ను బలి చేస్తున్నారా ?

సీనియర్లంతా కలిసి వీహెచ్‌ను బలి చేస్తున్నారా ?
x
Highlights

పీసీసీ చీఫ్ వివాదంలో.. సీనియర్లంతా కలిసి వీహెచ్‌ను బలి చేస్తున్నారా ? రేవంత్ రెడ్డిని కొత్త బాస్‌గా నియమించొద్దని సీనియర్లందరూ అనుకుంటున్నా.. వీహెచ్...

పీసీసీ చీఫ్ వివాదంలో.. సీనియర్లంతా కలిసి వీహెచ్‌ను బలి చేస్తున్నారా ? రేవంత్ రెడ్డిని కొత్త బాస్‌గా నియమించొద్దని సీనియర్లందరూ అనుకుంటున్నా.. వీహెచ్ మాత్రమే బయటపడ్డారు. దీనివెనక కూడా వాళ్ల హస్తం ఉందా? వీహెచ్‌ను రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారా ?

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ వివాదం రాజుకుంటోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ అధిష్టానంపై సీనియర్లు మండిపడుతున్నారు. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఇద్దరి పేర్లు ప్రస్తావనకు వచ్చినా కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ సీనియర్లంతా గుర్రుమంటున్నారు. ఢిల్లీలోనే ఉండి అధినేత్రి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. సోనియా లేదా రాహుల్ పిలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని కొత్త పీసీసీ నియమించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుండడంతో చివరి ప్రయత్నంగా అధిష్టానానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు సీనియర్లు.

రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ పార్టీలో సీనియర్లందరూ వ్యతిరేకిస్తున్నారు. ఉత్తమ్, భట్టి, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, వీహెచ్, మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. సోనియా నుంచి పిలుపు వస్తే రేవంత్‌కు పదవి ఇవ్వొద్దని తమలో ఒకరికి ఇవ్వాలని చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్లంతా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నా ఎవరూ బయటకు మాట్లాడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఐతే ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్‌లోనే ఉన్న వీహెచ్ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని కొత్త పీసీసీ బాస్‌గా చూడలేమంటూ అందరి తరఫున వాయిస్ వినిపిస్తూ అధిష్టానం దృష్టిలో పడుతున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

రేవంత్ రెడ్డి గురించి వీహెచ్‌తో వెనక ఉండి మాట్లాడిస్తోంది సీనియర్లేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. వీహెచ్‌కు తోడుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అధిష్టానానిక లేఖ రాశారు. ఇప్పుడు కొత్త పీసీసీని నియమిస్తే పార్టీ మరింత నష్టపోతుందని నాగార్జున సాగర్ ఎన్నికల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే ఉత్తమమని సూచించారు. దీంతో వీహెచ్ వాయిస్‌కు జగ్గారెడ్డి తోడయ్యారన్న చర్చ కూడా హస్తం పార్టీలో కొనసాగుతోంది. దీంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త చర్చ వినిపిస్తోంది. ఇలాంటి గందరగోళం మధ్య కొత్త పీసీసీని నియమించకుండా వాయిదే వేస్తే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

వీహెచ్ చేస్తున్న వరుస వ్యాఖ్య,లపై పార్టీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుందన్న చర్చ జరుగుతోంది. తనపై వీహెచ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ పూర్తి నివేదిక తెప్పించుకుంటున్నారు. ఇలా సీనియర్లంతా సైలెంట్‌గా ఉన్న సమయంల వీహెచ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రగడ రేపుతోందిప్పుడు ! దీనివెనక కూడా వాళ్లే ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఐతే ఇప్పుడు వ్యవహారం షోకాజ్ నోటీసు వరకు వెళ్లడంతో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories