Gandhi Bhavan: గాంధీభవన్‌కు వాస్తు మార్పులు.. రేవంత్ రెడ్డి కోసం..

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం గాంధీ భవన్ లో వాస్తు మార్పులకు టీపీసీసీ నూతన కమిటీ నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 2 July 2021 5:49 PM IST
Architectural changes to Gandhi Bhavan for TPCC Chief Rewanth Reddy
X

గాంధీభవన్‌ (ఇమేజ్ సోర్స్: ది హన్స్ ఇండియా )

Gandhi Bhavan - Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం గాంధీ భవన్ లో వాస్తు మార్పులకు టీపీసీసీ నూతన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈనెల 7న పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో గాంధీభవన్ లో వాస్తు మార్పులు చేపట్టబోతున్నారు. వాస్తు నిపుణులు, వేదపండితులు పర్యవేక్షిస్తున్నారు. గాంధీభవన్ లోకి ఎంట్రీ పాయింట్ ను మార్చనున్నారు. గాంధీభవన్ క్యాంటిన్, పాత గేటు నుండి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అదే విధంగా పార్టీ జెండాలు విక్రయించే రూం, సెక్యూరిటీ రూంను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. తూర్పు ఈశాన్యంలో ఎటువంటి బరువు ఉండకుండా ఏర్పాటు చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. గాంధీభవన్ ఆవరణలో ఎలాంటి కట్టడాలు లేకుండా గాంధీ విగ్రం మాత్రమే ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story