Apsara Murder Case: రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు.. How to Kil human being అని గూగుల్లో సెర్చ్..

Apsara Murder Case Sensational Reports Revealed in Remand Report
x

Apsara Murder Case: రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు.. How to Kil human being అని గూగుల్లో సెర్చ్..

Highlights

Apsara Murder Case: పూజారి సాయికృష్ణ చేతిలో దారుణ హత్యకు గురయిన అప్సర హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Apsara Murder Case: పూజారి సాయికృష్ణ చేతిలో దారుణ హత్యకు గురయిన అప్సర హత్య కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ఏప్రిల్ నుంచి సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారిందని రిపోర్ట్‌లో ఉంది. అయితే.. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు చేసిన సాయికృష్ణ.. నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్, ద్వారక ఆలయాలు సందర్శనకు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బలం బలపడింది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా లవ్ ప్రపోజ్ చేసింది అప్సర. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. తనను పెళ్లి చేసుకోకుంటే రోడ్డుకు ఈడుస్తానని అప్సర బ్లాక్‌మెయిల్ చేసింది.

అప్సరను అడ్డు తొలగించుకునేందుకు సాయికృష్ణ హత్య చేసినట్టు రిమాండ్‌ రిపోర్టులో ఉంది. ఇక.. హత్యకు వారం ముందు 'How To Kil Human Being' అని గూగుల్‌లో సాయికృష్ణ వెతికాడు. తనను కోయంబత్తూర్ తీసుకెళ్లాలని సాయికృష్ణను అప్సర కోరడంతో.. అప్సర హత్యకు కోయంబత్తూర్ టూర్‌ను అడ్డుపెట్టుకున్నాడు సాయికృష్ణ. ఈనెల 3న రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు.. టికెట్ బుక్ చేసినట్టు అప్సరను నమ్మించడంతో అప్సర సరూర్‌నగర్ నుంచి బయల్దేరింది. రాత్రి 9 గంటలకు శంషాబాద్ చేరుకున్నాక.. సాయికృష్ణ కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేయలేదని అప్సరతో చెప్పాడు. శంషాబాద్ నుంచి రాత్రి 12 గంటలకు సుల్తాన్‌పల్లి గోశాలకు చేరుకున్నారు అప్సర, సాయికృష్ణ. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు అప్సర నిద్రిస్తున్న సమయంలో సాయికృష్ణ హత్య చేసినట్టు రిమాండ్‌ రిపోర్టులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories