చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా అనంత నాగేశ్వరన్ నియామకం

Economic Advisor: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా ప్రముఖ కన్సల్టెంట్, రచయిత, అకాడమీషియన్ అనంత నాగేశ్వర్‌ను నియమించింది.

Sriveni Erugu
Published on: 29 Jan 2022 9:30 AM IST
Appointment of Anantha Nageshwaran as Chief Economic Advisor
X

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా అనంత నాగేశ్వరన్ నియామకం

Economic Advisor: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా ప్రముఖ కన్సల్టెంట్, రచయిత, అకాడమీషియన్ అనంత నాగేశ్వర్‌ను నియమించింది. ఇప్పటి వరకు సీఈవోగా కొనసాగుతున్న కె.సుబ్రమనియన్ స్థానంలో నాగేశ్వరన్‌ను నియమించింది. బడ్జెట్ రూప కల్పన పనుల్లో కేంద్రం నిమగ్నమైంది. బడ్జెట్ తయారీలో పాల్గొనే ఆర్థికవేత్తలు, అధికారులు, సిబ్బందిని నార్త్ బ్లాక్‌లో లాక్ ఇన్‌లోకి పంపించింది. అయితే కొత్త సీఈవో పదవీ బాధ్యతలు వెంటనే తీసుకుని బడ్జెట్ తయారీలో పాల్గొంటారా...? లేక తర్వాత రంగంలోకి దిగుతారా అనేది తెలియలేదు. ముఖ్య సలహాదారున్ని తప్పించి కొత్త వారిని నియమించడం చర్చనీయాంశంగా మారింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story