Telangana Aasara Pension: వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తుకు మరోసారి అవకాశం

*ఇవాళ్టి నుంచి 30 వరకు వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ *వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు

Shilpa
Updated on: 11 Oct 2021 9:28 AM IST
Applications for Telangana Aasara Pension will be Accepted from 11 10 2021 to 30 10 2021
X

వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తుకు మరోసారి అవకాశం(ఫైల్ ఫోటో)

Telangana Aasara Pension: తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తుకు మరోసారి అవకాశం కల్పించారు. అర్హులై ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఈనెల 30వ తేదీ వరకు వృద్ధాప్య పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని సూచించింది.

మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుదారుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవద్దని వాటన్నీంటిని తామే భరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తగ్గించిన వయో పరిమితిని అనుసరించి కొత్త వృద్ధాప్య పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. వృద్ధాప్య పెన్షన్లపై వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Shilpa

Shilpa

Next Story