AP-TS Water Disputes: వాటర్‌ వార్‌ కాస్త.. విద్యుత్‌ వివాదంగా మారుతున్న..

AP-TS Water Disputes: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం మరింత ముదిరింది.

Arun Chilukuri
Published on: 28 Jun 2021 8:27 PM IST
AP-TS Water Disputes Latest Update
X

ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా 

AP-TS Water Disputes: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు ఈ వాటర్‌ వార్‌ కాస్తా విద్యుత్‌ వివాదంగా మారుతోంది. తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు సంబంధించిన ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలని కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది ఏపీ సర్కార్‌. దీంతో తక్షణమే ఎడమ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలని తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు లేఖ రాసింది కేఆర్‌ఎంబీ.

ఇక ఈ లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై ఉన్న అన్ని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి వందశాతం జల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని విద్యుత్‌ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ నుంచి తక్షణమే దిగువ నీటి విడుదలను నిలిపివేయాలని కేఆర్‌ఎంబీ జెన్‌కోకు లేఖ రాసింది. ఇటీవల కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంధన శాఖ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్‌ జెన్‌కో తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story