తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి..

AP Telangana BJP Gets New Chiefs
x

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి..

Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి..

BJP: తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమిస్తూ హై కమాండ్ ప్రకటించింది.

గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ బీజేపీ హై కమాండ్ తెలుగు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులును ప్రకటించింది. గత నెల రోజుల నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ప్రెసిడెంట్ రేసులో తెలంగాణకు సంబంధించి పలువురు పార్టీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకి హైకమాండ్ మాత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికే తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించింది.

తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు ఊహించిందే అయినా.. ఏపీలో కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో మాత్రం హై కమాండ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించింది. కొన్ని రోజులుగా కేంద్రమంత్రివర్గంలో మార్పులు చేర్పులు.. పలు రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడితోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోము వీర్రాజును తప్పించినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories