సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా.. కేటీఆర్ కు ఆయన కు తెలిసిన ఫ్రెండ్ కు..

RK Roja: ఏపీ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆర్కే రోజా ప్రగతిభవన్‌కు వచ్చారు.

Arun Chilukuri
Published on: 29 April 2022 7:58 PM IST
AP Minister Roja Meets Telangana CM KCR
X

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా.. డైనమిక్ లీడర్ కేటీఆర్..

RK Roja: ఏపీ మంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఆర్కే రోజా ప్రగతిభవన్‌కు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను కలిశారు. మంత్రి హోదాలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రోజా సీఎంతో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాకు కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి​అభినందనలు తెలిపారు.

యూత్ ఐకానిక్ గా ఉన్న యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ ఏపీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తాను అనుకోనన్నారు మంత్రి రోజా. ఆయన పొరుగురాష్ట్రం అని సంబోదించినట్లు విన్నాన్న ఆమె ఒకవేళ ఏపీ అభివృద్దిపై మాట్లాడి ఉంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏపీలో ఎలాంటి అభివృద్ది జరిగిందో తెలియాంటే వారు ఏపీకి వస్తే స్వయంగా పర్యాటకశాఖ మంత్రిగా తాను ఆహ్వానిస్తామన్నారు. దగ్గరుండి మరీ ఏపీలో జరిగిన అభివృద్ది పనులేంటి, ప్రతిష్టాత్మక కార్యక్రమాలేమిటో వివరిస్తామన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమం గురించి తమిళనాడు అసెంబ్లీలో సైతం ప్రకటన చేసిన విషయాన్ని గమనిస్తామన్నారు. అప్పుడే ఏపీలో జరిగిన అభివృద్దేంటో కేటీఆర్ కు ఆయన కు తెలిసిన ఫ్రెండ్ కు వివరస్తామని చమత్కరించారు మంత్రి రోజా.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story