SV Prasad: మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత.. కేసీఆర్‌, చంద్రబాబు సంతాపం

SV Prasad: మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత.. కేసీఆర్‌, చంద్రబాబు సంతాపం
x

SV Prasad: మాజీ సీఎస్‌ ఎస్వీ ప్రసాద్‌ కన్నుమూత

Highlights

SV Prasad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ మంగళవారం క‌న్నుమూశారు.

SV Prasad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్ర‌సాద్ మంగళవారం క‌న్నుమూశారు. ఆయన కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. 2010లో ఉమ్మడి ఏపీలో సీఎస్‌గా పనిచేసిన ఎస్వీ ప్రసాద్ పలువురు ముఖ్యమంత్రులకు కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా పనిచేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా పనిచేశారు. పదేళ్లకుపైగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్ విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్‌గానూ ఎస్వీ ప్ర‌సాద్ పనిచేశారు.

కేసీఆర్‌, చంద్రబాబు సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్.వి. ప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం జాతీయ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన సేవలను గుర్తుచేస్తున్నారు. ఎస్వీ ప్రసాద్ అకాల మరణం తీరనిలోటన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories