AP Ambulances: పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన

AP Ambulances: Andhra Pradesh People Protest at Pullur Toll Plaza
x

AP Ambulances: పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన

Highlights

AP Ambulances: జోగులాంబ గద్వాల జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులోని పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఏపీ నుంచి కోవిడ్‌ పేషెంట్లతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకుంటున్నారు పోలీసులు.

AP Ambulances: జోగులాంబ గద్వాల జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులోని పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఏపీ నుంచి కోవిడ్‌ పేషెంట్లతో వస్తున్న అంబులెన్స్‌లను అడ్డుకుంటున్నారు పోలీసులు. హాస్పిటల్‌ నుంచి బెడ్‌ కన్ఫర్మేషన్‌ లెటర్‌తో పాటు ఈ పాస్‌ ఉన్నవారినే.. తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేని అంబులెన్స్‌లను వెనక్కి పంపించేస్తున్నారు. థర్మల్‌ స్కానింగ్‌ ద్వారా మిగిలినవారిని రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.

పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏపీ వాసులు కొద్దిసేపు ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి అంబులెన్స్‌లను అనుమతించని నేపథ్యంలో తెలంగాణ వాహనాలను ఏపీ వైపు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. తెలంగాణలోకి తమను రానివ్వనపుడు ఏపీలోకి ఎలా వస్తారని బీజేపీ నేతలు నిలదీశారు. ఏపీ భూభాగంలోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలని తెలంగాణ పోలీసులు వారికి సూచించారు. తెలంగాణ వైపు రాకుండా ఆందోళకారులను అడ్డుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories