రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌

Another Twist in Hyderabad Realtor Vijay Bhaskar Reddy Death Case
x

రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌

Highlights

Vijay Bhaskar Reddy: రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి హత్య కేసులో గంటగంటకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటుంది.

Vijay Bhaskar Reddy: రియల్టర్‌ విజయభాస్కర్‌ రెడ్డి హత్య కేసులో గంటగంటకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటుంది. ఈ హత్యలో గురూజీతోపాటు మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్తునిధుల కోసం గురూజీ, మాజీ ఎమ్మెల్యే పదేళ్లుగా అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇక బాచుపల్లిలోని విలాసవంతమైన విల్లాలో బాబా నివాసం ఉన్నట్లు గుర్తించారు.

ఈ విల్లాలో క్షుద్రపూజలు జరిగేవంటున్న స్థానికులు బాబాను నిత్యం కలిసేందుకు నేతలు, ప్రముఖులు వచ్చేవారని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బాబా ఇంటి సీసీఫుటేజ్‌, ఫోన్‌ కాల్‌ లిస్ట్‌పై ఆరా తీస్తున్నారు. అటు పలువురు బాబా సన్నిహితులను విచారిస్తున్న పోలీసులు బెంగళూరు, చెన్నై, ఏపీతో పాటు హైదరాబాద్‌లో బాబా కోసం గాలిస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాత్రపై సైతం పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories