Fraud: హైదరాబాద్‌లో మరో ఆన్‌లైన్‌ మోసం

Fraud: ఆన్‌లైన్‌ ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లు అమ్ముతామంటూ గాలం * యూసఫ్‌గూడకు చెందిన సిద్ధార్థను మోసం చేసిన బలరాం

Sandeep Eggoju
Published on: 10 July 2021 4:16 PM IST
Another Online Fraud in Hyderabad
X
Representational Image

Fraud: ఆన్‌లైన్‌ ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అమ్ముతామంటూ డబ్బులు వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితం ఢిల్లీకి చెందిన బలరాం కుమార్ ఆక్సిజన్ కన్సన్‌ట్రేటర్లు విక్రయిస్తానంటూ ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టాడు. అది చూసిన యూసఫ్ గూడకు చెందిన సిద్దార్థ ఫోన్ చేసి ఆర్డర్ చేశారు. డబ్బులు పంపిన తర్వాతే పరికరాలు పంపుతానని చెప్పడంతో 2లక్షల 85 వేలు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత నిందితుడు స్పందించకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన సిద్దార్థ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఢిల్లీకి చెందిన బలరాంను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story