TPCC Chief: త్వరలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో మెడికల్ కాలేజీ

TPCC Chief: పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Oct 2024 6:46 AM IST
Another Medical College in Nizamabad District Soon
X

TPCC Chief: త్వరలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో మెడికల్ కాలేజీ

TPCC Chief: పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కేశ వేణు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేర్చుతుందని హామీ ఇచ్చారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే మరొక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా, డబుల్ బెడ్ రూం ఇళ్లపై బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక స్థితిని అధ్వానంగా తయారు చేశారని, కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. నియంతలా పాలించిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story