Delhi Liqour Scam: లిక్కర్‌ స్కామ్‌లో.. అందిన ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత మరో లేఖ

Delhi Liqour Scam: కవిత విజ్ఞప్తులను ఈడీ అంగీకరిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Dhatripriya
Published on: 8 March 2023 6:53 PM IST
Another Letter Of MLC Kavitha To ED
X

Delhi Liqour Scam: లిక్కర్‌ స్కామ్‌లో.. అందిన ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత మరో లేఖ

Delhi Liqour Scam: లిక్కర్‌ స్కామ్‌లో అందిన ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. ఈనెల 11న విచారణకు సిద్ధమని తెలిపారు. దీంతో ఈనెల 11న విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 10న జంతర్‌ మంతర్‌ దగ్గర దీక్ష కారణంగా తాను రేపు విచారణకు హాజరుకాలేనని ఈడీకి తెలిపారు కవిత. అయితే ముందుగా ఈనెల 15 తర్వాత విచారణకు వస్తానని విజ్ఞప్తి చేశారు కవిత. ఆ తర్వాత మరో లేఖ రాసిన కవిత.. 11న విచారణకు వచ్చేందుకు సిద్ధమని తెలిపింది. కానీ ఇప్పటివరకు ఈడీ నుంచి స్పందన రాలేదు. దీంతో కవిత విజ్ఞప్తులను ఈడీ అంగీకరిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Dhatripriya

Dhatripriya

Next Story