తెలంగాణలో మరో 'ఇంజక్షన్ హత్య'.. రెండో భార్యకు ఇంజక్షన్ ఇచ్చి చంపిన భిక్షం

Telangana: బిడ్డకు జన్మనిచ్చిన మరుసటి రోజే మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య

Jyothi
Published on: 22 Sept 2022 1:10 PM IST
Another Injection Murder in Telangana
X

తెలంగాణలో మరో 'ఇంజక్షన్ హత్య'.. రెండో భార్యకు ఇంజక్షన్ ఇచ్చి చంపిన భిక్షం

Telangana: తెలంగాణలో మరో సూది మందు హత్య వెలుగు చూడటం సంచలనం రేకెత్తిస్తోంది. 4 రోజుల క్రితం చింతకాని మండలంలో కలకలం రేపిన హత్యను మరవక ముందే అదే తరహలో జరిగిన మరో మర్డర్ వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. భిక్షం అనే వ్యక్తి తన రెండో భార్యను హత్య చేసేందుకు ఈ ప్లాన్ అమలు చేశాడు. ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి డెలివరీ కోసం రెండో భార్యను తీసుకెళ్లిన భిక్షం.. ఆమెకు ఇంజక్షన్‌ ద్వారా అధిక మోతాదు ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె మృతి చెందింది. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా, అనస్థీషియా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో వివాహం అయ్యింది. అయితే వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో తనకంటే 20 ఏళ్ల చిన్నది అయిన నవీనను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు ముగ్గురూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే తరచూ గొడవలతో విసిగిపోయిన భిక్షం భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు. ప్రసవం కోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆడ శిశువు పుట్టింది. మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన ఆస్పత్రిలోనే చనిపోయింది.

నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయిందో అర్థం కాని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. భిక్షం కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. తర్వాత సీసీ ఫుటేజ్ పరిశీలించగా భిక్షం బండారం బయట పడింది. దీంతో పోలీసులకు అతన్ని అరెస్ట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story