Hyderabad: హైదరాబాద్‌లో మరో ఉగ్రవాది అరెస్ట్

Another HUT Terrorist arrested by NIA
x

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఉగ్రవాది అరెస్ట్

Highlights

Hyderabad: HUTకు చెందిన ఉగ్రవాది సల్మాన్‌ను అరెస్ట్‌ చేసిన NIA

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఉగ్రవాది అరెస్టయ్యాడు. HUTకు చెందిన ఉగ్రవాది సల్మాన్‌ను NIA అధికారులు అరెస్ట్‌ చేశారు. భోపాల్‌, హైదరాబాద్‌లో ఉగ్రకుట్రలకు ప్లాన్‌ చేసినట్టు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని మోతీలాల్‌ స్టేడియం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు సల్మాన్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. విదేశాల నుంచి వస్తున్న వాయిస్‌ మేసేజ్‌ల ఆధారంగా గుర్తించిన NIA.. హైదరాబాద్‌లో సల్మాన్‌ను అరెస్ట్ చేసింది.

మే 9న హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌, తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. మే 15న ఇద్దరు, మే 18న మరో ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు NIA అధికారులు. HUT ద్వారా యువతను సల్మాన్‌ రిక్రూట్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో 16 మందిని NIA అరెస్ట్ చేయగా.. వారిలో భోపాల్‌కు చెందినవారు 11 మందితో పాటు ఐదుగురు హైదరాబాదీలు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories