రామకృష్ణది పరువు హత్యే.. తేల్చిన పోలీసులు

Another Honour Killing in Telangana
x

రామకృష్ణది పరువు హత్యే.. తేల్చిన పోలీసులు

Highlights

Home Guard: తెలంగాణలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది.

Home Guard: తెలంగాణలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించిన తండ్రి వెంకటేష్‌ సుపారీ గ్యాంగ్‌తో అల్లుడిని హత్య చేయించిన ఉదంతం వెలుగుచూసింది. భువనగిరి జిల్లా లింగరాజుపల్లికి చెందిన మాజీ హోంగార్డు రామకృష్ణ అదే ప్రాంతానికి చెందిన భార్గవిని రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇది నచ్చని భార్గవి తండ్రి కక్షతో ఓ గ్యాంగ్‌తో చేతులు కలిపి పక్కా ప్లాన్‌తో రామకృష్ణ హత్యకు కుట్ర పన్నాడు. హోంగార్డుగా విధుల నుంచి తొలగించడంతో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ భువనగిరి కిసాన్‌ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.

రామకృష్ణను హత్య చేయించేందుకు హైదరాబాద్‌కు చెందిన లతీఫ్‌ గ్యాంగ్‌తో 10లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నాడు అమ్మాయి తండ్రి వెంకటేష్. ఇందులో భాగంగా ఫ్లాట్స్‌ చూపించాలంటూ లతీఫ్‌ గ్యాంగ్‌ రామకృష్ణను ట్రాప్‌ చేసి, సిద్దిపేట జిల్లా లకుడారానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపారు. రామకృష్ణ మర్డర్‌కు సంబంధించి నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సిద్దిపేట జిల్లా లకుడారంలో మృతదేహాన్ని వెలికితీశారు. రేపు పోస్టుమార్టం అనంతరం రామకృష్ణ స్వగ్రామం లింగరాజుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన భర్తను చంపినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భార్య భార్గవి డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు రామకృష్ణ హత్య కేసులో మొత్తం 11 మందిలో నలుగురిని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. తండ్రి వెంకటేష్‌తో పాటు మరో ఏడుగురి కోసం గాలిస్తునట్టు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories