ఆ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరగలేదు.. కార్ఖానా బాలిక ఘటనలో మరో ట్విస్ట్

Karkhana: సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్‌ పరిదిలో ఓ బాలికపై అఘాయిత్యం చేసిన ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 7 Jun 2022 3:41 PM IST
Another Gang Rape Incident in Hyderabad
X

ఆ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరగలేదు.. కార్ఖానా బాలిక ఘటనలో మరో ట్విస్ట్

Karkhana: సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్‌ పరిదిలో ఓ బాలికపై అఘాయిత్యం చేసిన ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు తెలిపారు. మైనర్ బాలికను ఐదుగురు యువకులు ట్రాప్ చేసినట్లు చెప్పారు. ఐదుగురు యువకుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. అమ్మాయితో స్నేహంగా ఉంటూ లైంగిక వాంఛ తీర్చకున్నట్లు నిర్ధారించారు. రెండు వేర్వేరు లాడ్జిల్లో బాలికను ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్లు, ముగ్గురు యువకులతో పాటు ఇద్దరు లాడ్జి నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలి విజ్ఞప్తి మేరకు కేసును గోప్యంగా దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story