Fraud: సోషల్‌ మీడియా వేదికగా మరో మోసం

Another Fraud as Social Media Platform in Hyderabad
x

Representational Image

Highlights

Fraud: ఈ సారి అబ్బాయిని మోసం చేసిన కిలాడీ లేడీ * పిప్పర్‌మెంట్‌ యాప్‌తో పరిచయం

Fraud: ఆన్‌లైన్‌ మోసాలు. ఈ కాలంలో మనకు అధికంగా వినపడుతున్న మాట. మన వీక్‌నెస్‌ను అడ్డంగా పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే సోషల్‌ మీడియా, వెబ్‌సైట్‌, యాప్స్‌లో అప్‌లోడ్‌ చేస్తామంటూ మోసాలకు పాల్పడటం.. ఇప్పుడు నడుస్తున్న నయా ట్రెండ్. అమాయకులు, చదువురానివాళ్లు, వృద్ధులే వారి టార్గెట్‌. ట్విస్ట్‌ ఏంటంటే.. అబ్బాయిలే ఇలాంటి వాటికి పాల్పడతారంటే పొరపాటే. అమ్మాయిలు కూడా ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చేశారు. మీరేనా మోసం చేసేది.. మేము కూడా చేస్తామంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా.. వెలుగు చూసిన ఘటన చూస్తే.. ఆ విషయం మీకే అర్థమవుతుంది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌క‌ర‌కాల మోసాలు రోజు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి. మ‌నీ యాప్స్, జాబ్ ఫ్రాడ్స్ తో పాటు అమ్మాయిలను ఆన్‌లైన్‌ ద్వారా ప‌రిచ‌యం చేసుకొని.. చ‌నువు పెరిగిన త‌ర్వాత ఆమె ఫోటోలు, వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ కు పాల్పడిన అబ్బాయిల కేసులు ఎన్నో చూశాం. కానీ.. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. అబ్బాయిలతో పరిచయం పెంచుకుని.. వారితో క్లోజ్‌గా మూవ్‌ అవుతూ.. వారి న్యూడ్‌ ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడింది ఓ కిలాడీ లేడీ.

తాజాగా హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన దీనికి అద్దం పడుతోంది. ఓ వ్యక్తికి పిప్ప‌ర్ మెంట్ యాప్ లో ఒకరి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా.. దానిని యాక్సెప్ట్ చేశాడు. ఇంకేముంది.. క‌వ్వించే చూపులు, కిక్కెక్కించే మాట‌ల‌తో అతడిని బుట్టల్లో వేసుకుంది రాజస్థాన్‌కు చెందిన ఓ మాయ లేడీ. అంతటితో ఆగక.. ఆ వ్యక్తిని పూర్తిగా త‌న మాట‌ల‌తో న‌మ్మించి.. వాట్సప్ వీడియో కాల్ ద్వారా త‌న అంద‌చందాలు చూపించి రెచ్చ‌గొట్టింది. అతడిని కూడా న్యూడ్ గా వీడియో కాల్ చేయాల‌ని టెమ్ట్ చేసింది. అప్ప‌టికే అమ్మ‌డు మోజులో ఉన్న ఆ వ్యక్తి చెప్పిందళ్లా తూచా త‌ప్ప‌కుండా చేశాడు.

ఇక అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఆ వ్యక్తికి సంబంధించిన న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు అన్నీ గేదర్‌ చేసుకొని, ఓ ఆట ఆడించింది. కాల్స్‌ మీద కాల్స్‌ చేస్తూ అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. దాంతో ఎక్కడ పరువు పోతుందోననే భయంతో చేసేదేమీలేక ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు ఆ వ్యక్తి. దాదాపు రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు సమర్పించుకున్నాడు. అప్ప‌టికీ వేధింపులు ఆగలేదు. తనపై కేసు నమోదైందని నకిలీ పోలీసులతో ఫోన్‌ చేయించి బెదిరించింది. ఇక ఆ బాధలు భరించలేక సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలాడీ లేడీ అండ్‌ గ్యాంగ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సోషల్‌ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు వద్దని పోలీసులు ఎంతో మొత్తుకుంటున్నారు. కానీ ఆ మాటలను పెడచెవిన పెడుతూ.. ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికైనా స్మార్ట్‌ ఫోన్స్‌ వాడేవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories