Crime News: స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Anjireddy Murder case solved by police in Hyderabad
x

Crime News: స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Highlights

Crime News: అంజిరెడ్డిని హత్యచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన రవి కాట్రగడ్డ

Crime News: సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్‌ స్టేషన్ పరిధిలో నిర్మాత, స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అంజిరెడ్డిని రవి కాట్రగడ్డ చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈనెల 29న ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రవి కాట్రగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మాత అంజిరెడ్డి ఆస్తుల కోసమే హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

వాణిజ్య సముదాయంలోని సెల్లార్‌లో నిర్మాతను చంపి పడవేశారు. ఇద్దరు బిహారీలతో కలిసి అంజిరెడ్డిని హత్య చేశారు. ఆస్తులు అమ్మి అమెరికాకు వెళ్లిపోవాలని అంజిరెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆస్తుల అమ్మే బాధ్యతను రవి కాట్రగడ్డకు అప్పగించాడు. అయితే ఆస్తులన్నింటిని తన పేరు మీద రాయించుకుని అంజిరెడ్డిని రవి హత్య చేశాడు. ఇద్దరు బిహారీలకు రవి కాట్రగడ్డ సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories