Andhra Pradesh: ఏపీలో మంత్రుల బస్ యాత్ర

Andhra Pradesh: ఈనెల 26 నుంచి 4 రోజులు బస్ యాత్ర

Rama Rao
Updated on: 19 May 2022 8:30 AM IST
Andhra Pradesh Minister Bus Tour | Andhra News
X

Andhra Pradesh: ఏపీలో మంత్రుల బస్ యాత్ర 

Andhra Pradesh: ఏపీ మంత్రులు బస్ యాత్రకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు సామాజిక న్యాయం ఈ అంశాలన్నీ జనంలోకి తీసుకువెళ్లేలా బస్ యాత్ర నిర్వహించనున్నారు.

ఈ నెల 26 నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ మంత్రులు బస్ యాత్ర నిర్వహించనున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం జనానికి వివరించడమే ప్రధాన అజెండాగా ఈ బస్ యాత్ర జరగనుంది. 17మంది ఎస్సి , ఎస్టీ , బిసి , మైనారిటీ మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యే లు పార్టీ సీనియర్స్ ఈ బస్ యాత్ర లో ఉంటారు. ఇప్పటికే గడప గడప కు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇది కాకుండా మంత్రులతో నాలుగు రోజులు మరింత ఎక్కువగా ప్రచారం చేయించాలని ఉద్దేశంతో ఈ బస్ యాత్ర ఏర్పాటు చేశారు.

బస్ యాత్రతో పాటు నాలుగు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు . అదేవిధంగా మంత్రులు కొన్ని ప్రాంతాల్లో బస్ నుంచే ప్రజలను ఉద్దేశించి ప్రసం గాలు చేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న సామాజిక న్యాయం, బిసిలకు, ఎస్సిలకు, మైనారిటీలకు లభించే ప్రాధాన్యత గురించి మంత్రులు బస్ యాత్రలో వివరించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story