Top
logo

హైదరాబాద్‌లో ఏపీ ఉన్నతాధికారి ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఏపీ ఉన్నతాధికారి ఆత్మహత్య
X
Highlights

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అధికారి హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్రకలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ...

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అధికారి హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్రకలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఫారెస్ట్ ఉన్నతాధికారి వి.భాస్కర రమణ మూర్తి (59) హైదరాబాద్లోని నాగోల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం నాగోల్‌లోని రాజీవ్ గృహకల్పలో ఉన్న అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఈయన బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు ఆయన కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

1987 బ్యాచ్‌కు చెందిన రమణమూర్తి గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు తెలుస్తాంది. కాగా ఆయన ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పని ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటనపై నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆయన డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Web TitleAndhra pradesh forest officer suicide in hyderabad telangana
Next Story