Supreme Court: తెలంగాణకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన ఏపీ

Supreme Court: నీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ

Sandeep Eggoju
Updated on: 2 Aug 2021 2:00 PM IST
Andhra Pradesh Filed a Petition Against Telangana in Supreme Court
X

సుప్రీమ్ కోర్ట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Supreme Court: సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జలవివాదంపై వాదనలు కొనసాగుతున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ విచారణ చేపట్టింది కోర్టు. నీటి ప్రాజెక్టుల పట్ల తెలంగాణ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ ఏపీకి రావాల్సిన వాటాను తెలంగాణ వ్యతిరేకిస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. విద్యుదుత్పత్తితో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. ఏపీ ప్రభుత్వానికి శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులపై నియంత్రణ ఉండాలని సుప్రీంకోర్టును కోరింది ఏపీ ప్రభుత్వం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story