Hyderabad: కేఎస్ బేకరీ యాజమాన్యం నిర్లక్ష్యం.. కేక్‌లో పురుగులు ప్రత్యక్షం

An Unexpected Shock for the Customer Who Bought the Birthday Cake
x

Hyderabad: కేఎస్ బేకరీ యాజమాన్యం నిర్లక్ష్యం.. కేక్‌లో పురుగులు ప్రత్యక్షం

Highlights

Hyderabad: బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కేక్ కట్ చేసి తింటుండగా పురుగుల ఎంట్రీ

Hyderabad: హైదరాబాద్‌లో బర్త్ డే కేక్ కొనుగోలు చేసిన కస్టమర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. నాచారారికి చెందిన ఓ వ్యక్తి తన ఫ్యామిలీలోని ఒకరి పుట్టినరోజు సందర్భంగా సమీపంలోని కేఎస్ బేకరీలో కేక్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంటికి తీసుకెళ్లిన కేక్‌ను కొంతభాగం వరకు కట్ చేసి తిన్నారు. అయితే ఇక్కడే ఆ ఫ్యామిలీకి అనుకోని షాక్ తగిలింది. మిగతా కేక్ కట్ చేస్తుండడంతో అందులో నుంచి ఒక్కసారిగా పురుగులు దర్శనమిచ్చాయి.

అప్పటికే పలువురు చిన్నారులు కేక్‌ను తినడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళనకు గురయ్యారు. కేక్‌లో పురుగుల వచ్చిన విషయాన్ని కేఎస్ బేకరీ యాజమాన్యానికి తెలిపాడు. అదే కేకును తీసుకెళ్లి యాజమాన్యాన్ని నిలదీశాడు. సమాధానం చెప్పాల్సింది పోయి తనపైకే బెదిరింపులకు దిగినట్లు బాధితుడు తెలిపాడు. కేక్ తయారీలో నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. యాజమాన్యంపై నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories