Anakapalle: వెలుగులోకి సొరంగం.. నిధులు ఉండే అవకాశం..

Anakapalle: ఎవరినీ లోపలికి వెళ్లనివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Shekhar G
Published on: 17 Jan 2024 6:40 PM IST
An Unearthed Tunnel In Anakapalli District
X

Anakapalle: వెలుగులోకి సొరంగం.. నిధులు ఉండే అవకాశం..

Anakapalle: అనకాపల్లి జిల్లాలో సొరంగం వెలుగులోకి వచ్చింది. రావికమతం దగ్గర సొరంగం బయటపడింది. కుళాయి పనులు చేస్తుండగా సొరంగం కనిపించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సొరంగం విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రావికమతం దగ్గరకు భారీగా తరలివస్తున్నారు. అయితే సొరంగం వెడల్పు తక్కువగా ఉండటంతో ఎవరూ లోనికి వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

మాడుగుల రాజుల కాలంలో ఈ ప్రాంతంలో సొరంగాలు చాలా ఉండేవని ఎప్పటినుంచో ఇక్కడ పుకార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఓ సొరంగం బయటపడటంతో.. సొరంగం ఆ కాలానికి చెందిందే అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సొరంగంలో నిధులు కూడా ఉన్నట్టు జోరుగా పుకార్లు సాగుతున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story