కాంగ్రెస్‌లో కొలిక్కి వచ్చిన మునుగోడు అభ్యర్థి ఎంపిక

T Congress: సాయంత్రం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం

Jyothi
Published on: 29 Aug 2022 11:17 AM IST
An Opportunity to Officially Announce the Munugode Candidate in the Evening
X

కాంగ్రెస్‌లో కొలిక్కి వచ్చిన మునుగోడు అభ్యర్థి ఎంపిక

T Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డిలలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇద్దరి బలాబలాలపై సర్వే రిపోర్ట్‌ను .. ఏఐసీసీ సెక్రటరీలకు పంపిన పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు. సాయంత్రం మరోసారి ఏఐసీసీ నేతలతో భేటీ తర్వాత .. అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే ఛాన్స్.

తెలంగాణలో 2023 ఎన్నికల వాతావరణం ఇప్పటి నుండే కనిపిస్తుంది. మునుగోడు ఉపఎన్నికతో పొలిటికల్ హీట్ రాజుకుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా మారడంతో... తాడోపేడో తేల్చుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. వెయ్యి మందితో యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి.. మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు.

Jyothi

Jyothi

Next Story