10 రోజుల్లో పెళ్లి.. ప్రాణం తీసిన అక్రమ సంబంధం...

An Illicit Relationship Cause 2 Deaths in Khammam | Breaking News
x

Representational Image

Highlights

Khammam: *ఇటీవలే మృతుడు నవీన్ కు ఎంగేజ్మెంట్ *జూన్ 9న మృతుడు నవీన్ వివాహం నిశ్చయం

Khammam: ఖమ్మం నగరంలోనీ గోపాలపురంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓవ్యక్తి హత్యకు కారణమైంది. ఖమ్మం పరిధిలోని అల్లిపురంకు చెందిన వీరబాబు భార్య కల్పనతో స్థానికంగా ఉండే నవీన్ అనే యువకుడు గత కొంత కాలంగా లైంగిక సంబంధం పెట్టకున్నాడు. ఈవిషయం తెలుసుకున్న వీరబాబు పథకం ప్రకారం సోమవారం వీరిద్దరు కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ ఘటనలో వీరబాబు భార్య కల్పన కూడా గాయపడగా.. ఆమె ప్రియుడు నవీన్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతనిని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. కాగా మృతుడు నవీన్ కు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్ 9న వివాహం జరగాల్సి ఉంది. ఈమేరకు కేసునమోదుచేసిన ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories