Warangal: ఆస్తికోసం హత్య.. తమ్ముడిని చంపిన అన్న

Warangal: కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

Shekhar G
Updated on: 4 Feb 2024 6:01 PM IST
An Elder Brother Who Killed His Younger Brother Due To Property Disputes
X

Warangal: ఆస్తికోసం హత్య.. తమ్ముడిని చంపిన అన్న

Warangal: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల కారణంగా సొంత తమ్ముడినే హతమార్చాడు ఓ అన్న. నందిగామ గ్రామానికి చెందిన ఐలక్క, మొగిలయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. అన్నదమ్ములైన రవి, కుమార్‌లకు కొంతకాలంగా ఇంటి స్థలాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు కుమార్‌పై సోదరుడు రవి దాడి చేశాడు. ఇరువురి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో కుమారస్వామిని కత్తితో గొంతు కోశాడు.

దీంతో కుమారస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అరుపులు కేకలు విన్న స్థానికులు అక్కడి చేరుకునే లోపు కుమారస్వామి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అక్కడికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story