ఫోటోలు, వీడియోలు లీక్.. అలర్టైన పోలీసు ఉన్నతాధికారులు, అత్యవసర భేటీ..

Amnesia Pub: మైనర్‌ బాలికపై అత్యాచార కేసు చర్చనీయాంశమైంది.

Arun Chilukuri
Published on: 4 Jun 2022 3:04 PM IST
Amnesia Pub Case Police Officials Meet at Jubilee Hills Police Station
X

ఫోటోలు, వీడియోలు లీక్.. అలర్టైన పోలీసు ఉన్నతాధికారులు, అత్యవసర భేటీ..

Amnesia Pub: మైనర్‌ బాలికపై అత్యాచార కేసు చర్చనీయాంశమైంది. కీలకమైన వీడియోలు బయటకు ఎలా వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమై వీడియోలు, ఫోటోల లీకేజీపై చర్చిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు వీడియోలు, ఫోటోలు ఎలా చేరాయనే అంశంపై ఆరాతీస్తున్నారు. అత్యాచారకేసు మైనర్లు ఉన్నందువల్ల బాధితురాలు, నిందితుల వివరాలను వెల్లడించవద్ద, బహిర్గంతం చేయవద్దని ముందస్తుగానే వెస్ట్ జోన్‌ డిసీపీ జోయల్‌ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఘటనకు సంబంధించిన కీలక వీడియోలు, ఫోటోలు బయటకిరావడంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story