BJP: బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఈనెల 28న తెలంగాణకు అమిత్ షా

BJP: తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి

Shekhar G
Updated on: 19 Jan 2024 11:21 AM IST
Amit Shah to Telangana on the 28th of this month
X

BJP: బిజెపి స్పెషల్ ఫోకస్.. ఈనెల 28న తెలంగాణకు అమిత్ షా

BJP: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై కూడా దృష్టి సారించింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. రాష్ట్రంలో టూర్ సందర్భంగా ఆయన బిజీబిజీగా ఉండనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలతో సమావేశంకానున్నారు. అటు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీలతో సమావేశం నిర్వహించనున్నారు అమిత్ షా. మరో వైపు హైదారబాద్‌లోనూ వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో భేటీ కానున్నారు. తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ సీట్లే సాధించడమే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసమే ఈసారి తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Shekhar G

Shekhar G

Next Story