Amit Shah: నేడు హైదరాబాద్‌కు అమిత్ షా

Amit Shah: రాత్రి 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్‌ షా

Jyothi
Published on: 17 Nov 2023 8:03 AM IST
Amit Shah to Hyderabad Today
X

Amit Shah: నేడు హైదరాబాద్‌కు అమిత్ షా

Amit Shah: మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా.. బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. రాత్రి 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి గద్వాలకు వెళ్లనున్న అమిత్ షా..బహిరంగ సభలో పాల్గొంటారు.

అనంతరం అక్కడి నుంచి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన సభకు అమిత్ షా హాజరవుతారు. నల్గొండ సభ ముగిశాక అమిత్ షా వరంగల్‌కు వెళ్లనున్నారు. అక్కడ సభ ముగిశాక... సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించే.. మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి సహా అనుబంధ విభాగాల.. జాతీయ సమావేశానికి అమిత్‌ షా హాజరవుతారు.

Jyothi

Jyothi

Next Story