Amit Shah: తెలంగాణలో రెండోసారి అమిత్‌షా సభ రద్దు

Amit Shah Sabha was Canceled for the Second time In Telangana
x

Amit Shah: తెలంగాణలో రెండోసారి అమిత్‌షా సభ రద్దు

Highlights

Amit Shah: ఈ నెల 29న ఖమ్మంలో జరగాల్సిన బీజేపీ సభ రద్దు

Amit Shah: తెలంగాణలో అమిత్‌ షా సభ రెండోసారి రద్దయింది. ఈ నెల 29న ఖమ్మంలో జరగాల్సిన సభకు అమిత్‌షా రాలేకపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో షా సభను రద్దు చేస్తున్నట్టు టీబీజేపీ ప్రకటించింది. అయితే.. తెలంగాణలో షా టూర్‌ యథాతధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 29న తెలంగాణలో అమిత్‌ షా పర్యటించనున్నారు. అధికారిక కార్యక్రమంతో పాటు.. మేధావులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ కమలనాథులు.

గత నెల 15న ఖమ్మంలో బీజేపీ సభ జరగాల్సి ఉంది. ఆ సభకు అమిత్‌ షా హాజరుకావాల్సి ఉంది. అయితే.. అప్పట్లో బిపర్‌జాయ్‌ తుఫాన్‌ కారణంగా షా పర్యటన రద్దయింది. ఇప్పుడు మరోసారి వర్షాల వల్ల ఖమ్మం రద్దు కావడంతో కమలం కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories