మధ్యలోనే రోడ్‌షో ముగించిన అమిత్‌ షా

Arun Chilukuri
Published on: 29 Nov 2020 2:41 PM IST
మధ్యలోనే రోడ్‌షో ముగించిన అమిత్‌ షా
X

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేటకు వచ్చిన ఆయనకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న అమిత్‌ షాకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అమిత్‌ షా.

అమ్మవారి దర్శనం తర్వాత అమిత్‌ షా వారాసిగూడకు బయల్దేరారు. అక్కడ నుంచి ఆయన రోడ్‌ షో ప్రారంభించారు. రోడ్‌ షోలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటు షా రాకతో నగరమంతా కాషామయం అయ్యింది.

అయితే అమిత్ షా రోడ్ షో మధ్యలోనే ముగిసింది. వారాసిగూడ నుంచి రోడ్ షో ప్రారంభించిన ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. సమయాభావంతోనే అమిత్ షా ఎలాంటి ప్రసంగం లేకుండానే రోడ్ షోకి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. అయితే కవాడిగూడ నుంచి బీజేపీ ఆఫీస్‌కు వెళ్లారు అమిత్ షా. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశమై తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story