కరోనా ఎఫెక్ట్... అమిత్ షా సభ వాయిదా

Arun Chilukuri
Updated on: 4 March 2020 6:50 PM IST
Amit shah Corona Virus
X
కరోనా ఎఫెక్ట్... అమిత్ షా సభ వాయిదా

హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా పడింది. మాస్ కార్యక్రమాలు వద్దని ప్రధాని మోడీ సూచించడంతో అమిత్ షా సభ వాయిదాపడింది. సీసీఏకు మద్దతుగా ఈ నెల 15న హైదరాబాద్ లో అమిత్ షా సభను బీజేపీ ఏర్పాటు చేసింది.

కరోనా నేపథ్యంలో అమిత్ షా సభను బీజేపీ వాయిదావేసింది. కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తరువాత సభను నిర్వహించే యోచనలో తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు. హైదరాబాద్‌లో సీఏఏ అనుకూల సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని టీఆర్ఎస్ యోచిస్తున్న తరుణంలోనే అమిత్ షాతో సీఏఏ అనుకూల సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ భావించిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story