Amit Shah: తెలంగాణలో పొలిటికల్ హీట్.. కమలం శ్రేణుల్లో జోష్ నింపనున్న అమిత్‌ షా

Amit Shah: సూర్యాపేట ప్రజాగర్జన సభలో పాల్గొననున్న అమిత్‌ షా

Shekhar G
Published on: 27 Oct 2023 2:25 PM IST
Amit Shah On Telangana Tour
X

Amit Shah: తెలంగాణలో పొలిటికల్ హీట్.. కమలం శ్రేణుల్లో జోష్ నింపనున్న అమిత్‌ షా 

Amit Shah: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తుంది. అధికార పార్టీని ఢీకొనేందుకు బీజేపీ జాతీయ అగ్ర నాయకులు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో బీజేపీ అగ్ర నాయకుల చరిష్మాను వాడుకొనేందుకు ప్రణాళికలను రాష్ట్ర బీజేపీ నేతలు వారి అస్తశస్త్రాలను వాడుతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత నెలలో మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు హామీలను ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కూడా వివిధ జిల్లాల్లో రాష్ట్ర నాయకులు ప్రచారానికి తీసుకువచ్చారు. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీపై విమర్శల వర్షం గుప్పించారు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌లో పోలీసుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు హాజరుకానున్నారు. అనంతరం సూర్యాపేట వెళ్లనున్న అమిత్ షా.. మధ్యాహ్నం జనగర్జన సభలో పాల్గొననున్నారు.

Shekhar G

Shekhar G

Next Story