అమిత్ షాకు ఆతిథ్యమిచ్చిన సామాన్య కార్యకర్త సత్యనారాయణ.. కీలక హామీ ఇచ్చిన..

Amit Shah: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షాకు ఆతిథ్యమివ్వడం పట్ల బీజేపీ కార్యకర్త సత్యనారా‍యణ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Arun Chilukuri
Updated on: 21 Aug 2022 8:25 PM IST
Amit Shah Meet BJP Activist Satyanarayana
X

అమిత్ షాకు ఆతిథ్యమిచ్చిన సామాన్య కార్యకర్త సత్యనారాయణ.. కీలక హామీ ఇచ్చిన..

Amit Shah: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షాకు ఆతిథ్యమివ్వడం పట్ల బీజేపీ కార్యకర్త సత్యనారా‍యణ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సామాన్య కార్యకర్త ఇంటిని సందర్శించిన అమిత్ షా, కుటుంబ బాగోగులను తెలుసుకోవడం జీవితంలో మధురమైన సందర‌్భమని అభిప్రాయం వ్యక్తంచేశారు. జాతీయస్థాయి నాయకుడు ఇంట్లోకూర్చొని బాగోగులు తెలుసుకోవడం ఆనందించదగిన విషయమన్నారు.

సత్యనారాయణ ఇంట్లో అమిత్‌ షా టీ తాగి, స్వీట్‌ ఆరగించారు. అక్కడే కొంతసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా అమిత్‌ షా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం బలంగా పోరాడాలని సూచించారు. పార్టీ ప్రతీ ఒక్కరికీ గౌరవం దక్కుతుందని అమిత్‌ షా హామీ ఇచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story