Amit Shah: ముఖ్యనేతల మధ్య కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్

Amit Shah: ఈటల, బండి సంజయ్, కిషన్ రెడ్డి తో ప్రత్యేకంగా భేటీ

Shekhar G
Published on: 28 Dec 2023 7:28 PM IST
Amit Shah Is Serious About The Cold War Between The BJP Leaders
X

Amit Shah: ముఖ్యనేతల మధ్య కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ 

Amit Shah: తెలంగాణ బీజేపీ ముఖ్యనేతల మధ్య కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ అయ్యారు. ఈటల, బండి సంజయ్, కిషన్ రెడ్డి తో ప్రత్యేకంగా భేటీ అయిన అమిత్ షా.. ముగ్గురు నేతల మధ్య విభేదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలంతా వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా.. పార్టీ కోసం పనిచేయాలని దిశానిర్థేశం చేశారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని ఆదేశించిన అమిత్ షా..నేతల మధ్య సమన్వయలోపం లేకుండా చూడాలని కిషన్ రెడ్డికి సూచించారు.

మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలకు పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతం కన్నా సీట్లు, ఓట్ షేర్ పెరిగినప్పటికీ..‌ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై అమిత్ షా నేతలో చర్చించారు.

బీసీ‌ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఫ్లోర్ లీడర్ గా బీసీ ఎమ్మెల్యే ఉండేలా చూలని అమిత్ షా నేతలకు సూచించారు. దీంతో బీసీ ఎమ్మెల్యేలు రాజసింగ్, పాయల్ శంకర్ ఫ్లోర్ లీడర్ రేసులో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే.. ఏలేటి మహేశ్వరరెడ్డి, కాటిపల్లి వెంకటరమణరెడ్డికి అవకాశం దక్కనుంది. మరికాసేపట్లో అమిత్ షా ఫ్లోర్ లీడర్ ను ఎంపిక చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story