Amberpet SI Bhanu Prakash Reddy Arrested: అంబర్‌పేట్ ఎస్సై భానుప్రకాశ్ రెడ్డి అరెస్ట్

Amberpet SI Bhanu Prakash Reddy Arrested
x

Amberpet SI Bhanu Prakash Reddy Arrested: అంబర్‌పేట్ ఎస్సై భానుప్రకాశ్ రెడ్డి అరెస్ట్

Highlights

Amberpet SI Bhanu Prakash Reddy Arrested: హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీసులు ఎస్సై భానుప్రకాశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

Amberpet SI Bhanu Prakash Reddy Arrested: హైదరాబాద్ అంబర్‌పేట్ పోలీసులు ఎస్సై భానుప్రకాశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. భానుప్రకాశ్ రెడ్డి రివాల్వర్ మాయం అయిందని ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది.

మాజీ ఎస్సై బెట్టింగ్‌లో చిక్కుకొని అప్పుల పాలై, అప్పులు తీర్చుకునేందుకు తుపాకీని తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన రికవరీ చేసిన ఐదు తులాల బంగారాన్ని స్వంత ఉపయోగంలో వాడిన అంశం వెలుగులోకి వచ్చింది.

అప్పటి నుంచి ఆయనపై ఉన్నతాధికారులు కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. నవంబర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో, రివాల్వర్ ఎక్కడికి పోయిందో ఇప్పటికి తెలియదు.

భానుప్రకాశ్ రివాల్వర్ ట్రైన్‌లో, విజయవాడలో లాడ్జ్‌లో పెట్టి మాయం అయ్యిందని వివిధంగా చెప్పాడు, కానీ పోలీసులు దానికి సంబంధించిన ఆధారాలు గుర్తించలేకపోయారు. ప్రస్తుతం అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించి, పూర్తి విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories