Arvind Dharmapuri: కర్ణాటలో జరిగే అవినీతిలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు వాటాలు పొందారు

Almatti Dam Height Increase Controversy MP Arvind's Sensational Allegations on Karnataka Corruption

Arun Chilukuri
Published on: 23 Sept 2025 3:27 PM IST
Arvind Dharmapuri: కర్ణాటలో జరిగే అవినీతిలో ఇక్కడి కాంగ్రెస్ నేతలు వాటాలు పొందారు
X

Arvind Dharmapuri: నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఆల్మట్టి డ్యాంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతామని చెబుతున్నప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఈ మౌనం వెనుక కుట్ర ఉందని ఆరోపించిన ఎంపీ అరవింద్, కర్ణాటకలో జరుగుతున్న అవినీతిలో ఇక్కడి కాంగ్రెస్ నేతలకు వాటాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని ఆయన డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story