బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో బయటపడుతోన్న లింకులు

Akhila Priya
x
Highlights

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో తవ్వేకొద్దీ లింకులు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో పలువురిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోగా...

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో తవ్వేకొద్దీ లింకులు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో పలువురిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పుడు మరొకరికి కూడా లింకులున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కృష్ణాజిల్లా వైసీపీ కార్యకర్త దేవరకొండ వెంకటేశ్వర్రావు‌‌ కుమారులను పోలీసులు ప్రశ్నించారు. అయితే, బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు వెంకటేశ్వర్రావు. భూమా అఖిలప్రియతో ఎలాంటి సంబంధాల్లేవని వైసీపీ అభిమానిగా ఉన్న తనను ప్రత్యర్ధులు కావాలనే ఇరికిస్తున్నారని చెబుతున్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఆరోపణలు రావడంతో తానే స్వయంగా పిల్లలను తెలంగాణ పోలీసులకు అప్పగించానని దేవరకొండ వెంకటేశ్వర్రావు‌‌ తెలిపారు. మాకు సంబంధముంటే చర్యలు తీసుకోమని పోలీసులను కోరానని దాంతో, తెలంగాణ పోలీసులు తనను అభినందించారని చెప్పుకొచ్చారు. అయితే, తాను పరారీలో ఉన్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని వెంకటేశ్వర్రావు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories