logo
తెలంగాణ

రేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర

All Set For TPCC Chief Revanth Reddy Padayatra in Munugodu
X

రేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర

Highlights

Revanth Reddy: ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్‌ ప్లాన్‌

Revanth Reddy: మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలను పదునుపెడుతోంది. మునుగోడు పర్యటనకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. మన మునుగోడు - మన కాంగ్రెస్‌ పోస్టర్‌‌ను రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. కరోనా నుంచి కోలుకోవడంతో మునుగోడు పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఒకే రోజు 5 మండలాల్లో పాదయాత్రకు రేవంత్‌ ప్లాన్‌ చేశారు. ఇక అదే సమయంలో నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ శ్రేణులు పాదయాత్రలు చేయనున్నారు. ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. రేపు రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని... 175 గ్రామాల్లో జయంతి వేడుకలు నిర్వహించనుంది హస్తం పార్టీ.


Web TitleAll Set For TPCC Chief Revanth Reddy Padayatra in Munugodu
Next Story