Breaking News : తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

Arun Chilukuri
Published on: 30 Jun 2020 3:23 PM IST
Breaking News : తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా
X

తెలంగాణ అన్ని ప్రవేశ పరీక్షలనూ వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రేపటి నుంచి ఈ నెల 15 వరకూ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ఖరారు చేసింది కాగా.. ప్రభుత్వ నిర్ణయం‌తో పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంసెట్‌, పాలిసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌, ఎడ్‌సెట్‌, పీఈ సెట్‌ వాయిదా పడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story