నేడు నేరెడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు

నేడు నేరెడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాలేదు. ఇప్పటి వరకు 149 డివిజన్ ల ఫలితాలే ప్రకటించారు. వీటితో పాటు మరో డివిజన్ ఫలితం వెలువడాల్సి ఉంది. హైకోర్టు సూచన మేరకు ఆపివేసిన నేరెడ్ మెట్ డివిజన్ ఫలితం.. కోర్టు సూచన మేరకు కౌంటింగ్ ను కొనసాగించనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాలేదు. ఇప్పటి వరకు 149 డివిజన్ ల ఫలితాలే ప్రకటించారు. వీటితో పాటు మరో డివిజన్ ఫలితం వెలువడాల్సి ఉంది. హైకోర్టు సూచన మేరకు ఆపివేసిన నేరెడ్ మెట్ డివిజన్ ఫలితం.. కోర్టు సూచన మేరకు కౌంటింగ్ ను కొనసాగించనున్నారు.

స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ ఓట్ల కన్నా ఎక్కువ ఉన్నందున కౌంటింగ్ నిలిపేశారు. హైకోర్టు తీర్పు తర్వాతే ఆ ఫలితాన్ని ప్రకటిస్తామని గతంలో చెప్పారు. అయితే ఇతర ముద్రతో ఉన్న ఓట్లను కూడా లెక్కలోకి తీసుకొవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపద్యంలో హై కోర్టు సూచన మేరకు నేరెడ్ మెట్ డివిజన్ లో నిలిపివేసిన కౌంటింగ్ ను ఇవాళ కొనసాగించనున్నారు.

నేరెడ్ మెట్ డివిజన్ లో మొత్తం 56వేల 92 ఓట్లు ఉన్నాయి. ఈనెల ఒకటో తేదిన జరిగిన పోలింగ్ లో.. 25వేల 114 ఓట్లు పోలయ్యాయి. ఈనెల నాల్గవ తేదిన అన్ని డివిజన్ లతో పాటు నేరేడ్ మెట్ లో కూడా కౌంటింగ్ జరిగింది. కాని చివరి నిమిషంలో ఎన్నికల కౌంటింగ్ విషయంలో వివాదం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎన్నికల ట్రిబ్యునల్ ను ఆశ్రయించమని హైకోర్టు సూచించింది. అయితే.. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజారిటీ ఉంది. ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 544 ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ హైకోర్టు సూచన మేరకు ఎన్నికల కౌంటింగ్ ను కొనసాగించనున్నారు.

కాసేపట్లో నేరేడ్ మెట్ డివిజన్ లో ఆగిపోయిన ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్ధి 504 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఫలితం టిఆర్ఎస్ కు అనుకూలంగా వస్తే, ఆ పార్టికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 56 స్థానాలు వచ్చినట్టు అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories