దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి!

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి!
x
Highlights

దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజీ డీబ్లాక్ లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు

దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజీ డీబ్లాక్ లో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. ముందు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ చేశాక ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగించనున్న అధికారులు ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలు అందిస్తామని చెబుతున్నారు. వెబ్‌సైట్‌లో రౌండ్ల వారీగా అప్డేట్ ఉంటుందన్నారు.

మొత్తం 14 టేబుల్స్, 23 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ముగియ‌నుంది. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో మొత్తం 200 మంది సిబ్బంది పాల్గొన‌నున్నారు. కౌంటింగ్ ప్రక్రయలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో లక్షా 64 వేల 192 ఓట్లు పోల‌య్యాయి. ఇక టీఆర్ఎస్ తరపున సోలిపేట సుజాత, బీజేపీ తరపున రఘునందన్ రావు, కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఉప ఎన్నికను అన్నీ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి..

సర్వేలు ఎం చెబుతున్నాయి?

దుబ్బాకలో తొలిసారి కమలం వికసించబోతోందని, హోరా హోరీగా జరిగిన పోరులో కారు వెనుకబడిందని, ప్రముఖ సర్వే సంస్థ మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వే అంచనా వేసింది. పార్టీల వారీగా తెచ్చుకోనున్న ఓట్ల సంఖ్యపై కూడా అంచనాలు వేసింది. అయితే ప్రతి పార్టీకి వస్తాయని అంచనా వేసిన ఓట్లలో 6.53 శాతం తేడా ఉండొచ్చని ముందుగానే తెలియచేసింది మిషన్‌ చాణక్య. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ 9,789 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ఆ సంస్థ అంచనా వేసింది.

ఇక దుబ్బాక ఉపఎన్నికలో గులాబీ గెలుపు ఖాయమని ఆరా అనే సర్వే సంస్థ అంచనా వేసింది.. హోరాహోరీ జరిగిన ఉప పోరులో అధికార పార్టీ అందలమెక్కనుందని ఆరా సంస్థ వెల్లడించింది. ఇక బీజేపీ సెకండ్ ప్లేస్‌లో నిలుస్తుందని ఆరా సంస్థ గట్టిగా చెబుతుంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు 48.72శాతం, బీజేపీకి 44.64శాతం ఓట్లు నమోదైనట్లు ఆరా సంస్థ చెబుతోంది. ఇక కాంగ్రెస్‌కు 6.12శాతం, ఇతరులకు 2.52శాతం ఓట్లు నమోదైనట్లు ఆరా సంస్థ తన సర్వే ద్వారా అంచనా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories