Ganesh Immersion: 19న నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

All Arrangements Are Completed for Ganesh Immersion on Sunday
x

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి (ఫైల్ ఇమేజ్)

Highlights

Ganesh Immersion: ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన నగర కమీషనర్ అంజనీ కుమార్

Ganesh Immersion: 19న జరగనున్న వినాయక నిమజ్జనానికి పోలీసులు, జీహెచ్‌ఎంసీ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు. బాలాపూర్ గణేషుడిని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా కారణంగా గతేడాది జరుపుకోలేక పోయిన ఉత్సవాలు ఈ ఏడాది ఘనంగా జరుగుతున్నాయన్నారు. ఇక నగర వ్యాప్తంగా 3 లక్షలకు పైగా గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. ఇక 19న అన్ని విగ్రహాల నిమజ్జనం జరిగిపోవాలని... నిమజ్జనం సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని మండప నిర్వాహకులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories