Aliyabad Municipal Election: అలియాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. బీజేపీ మద్దతుతో ఛైర్‌పర్సన్‌గా కంఠం శిరీష ఎన్నిక!

Aliyabad Municipal Election: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు అనూహ్య మలుపు తిరిగాయి.

Arun Chilukuri
Published on: 16 Feb 2026 12:50 PM IST
Aliyabad Municipal Election: అలియాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం.. బీజేపీ మద్దతుతో ఛైర్‌పర్సన్‌గా కంఠం శిరీష ఎన్నిక!
X

Aliyabad Municipal Election: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు అనూహ్య మలుపు తిరిగాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రక్రియలో చివరకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన కంఠం శిరీష నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితుల్లో, అనూహ్యంగా బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం.

బలాబలాలు ఇలా:

అలియాబాద్ మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డులకు గాను ఫలితాలు కింది విధంగా ఉన్నాయి:

కాంగ్రెస్: 08 వార్డులు

బీఆర్ఎస్: 07 వార్డులు

బీజేపీ: 03 వార్డులు

ఇతరులు/స్వతంత్రులు: 02 వార్డులు

బీజేపీ మద్దతుతో మలుపు:

మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ (11) ఏ పార్టీకి రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. 7 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ పీఠం కోసం ప్రయత్నించినప్పటికీ, 8 స్థానాలు ఉన్న కాంగ్రెస్‌కు 3 స్థానాలు గెలిచిన బీజేపీ మరియు ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. దీనితో కాంగ్రెస్ బలం 13కు చేరి ఛైర్‌పర్సన్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంది.

జిల్లా రాజకీయాల్లో బద్ధశత్రువులుగా ఉండే కాంగ్రెస్, బీజేపీలు మున్సిపల్ పీఠం విషయంలో చేతులు కలపడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా ఈ వ్యూహం ఫలించినట్లు కనిపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story