Telangana: రంగారెడ్డి జిల్లాలో మందుబాబు హల్‌చల్

Telangana: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నరేష్ బైక్ స్వాధీనం * నిరసనగా హైటెన్షన్ స్తంభం ఎక్కిన నరేష్

Sandeep Eggoju
Published on: 10 March 2021 8:38 PM IST
Alcohol Drunked Men Highlight In Rangareddy District
X

Representational Image

Telangana: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఓ మందుబాబు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో తన బైక్ స్వాధీనం చేసుకోవడంతో హైటెన్షన్ స్తంభం ఎక్కి అక్కడి నుంచి దూకేస్తా అంటూ హల్‌చల్ చేశాడు. ఆ సమయంలో పవర్ సప్లై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చివరికి షాబాద్ సీఐ వచ్చి నీ మీద కేసు లేకుండా చూస్తా.. నీ బైక్ నీకు తిరిగి ఇచ్చేస్తా అని మాటిచ్చారు. నరేష్ భార్య సైతం కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఎట్టకేలకు కిందకు దిగాడు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story